Wednesday, September 19, 2018

జ్ఞాపకం

నీ జ్ఞాపకాల విలువెంతో తెలుసా
నీ కోసం మరో జన్మలో పుట్టేంత
ఈ జన్మలో నిన్ను మరువలేనంత..!!

ఆమె వేశ్య కాదు... కూలీ..

#ఆమె వేశ్య కాదు. కూలీ..

అదొక రతి రాక్షసుల
కామకోట
కోట గుమ్మం ముందు కూలీలు
అర్ధనగ్నంగా పనికోసం
కోరిక గల వారిని
ఆకర్షిస్తున్నారు ఆకలితో...

జానెడు పొట్ట కోసం చీరను
జారనివ్వాల్సిందే జాగ్రత్తగా..
వారి స్థనాలను దాచుకోవడానికి
వాళ్ళ మేస్త్రీ ఒప్పుకోడు..
కూలీ చెల్లించాలంటే
వీళ్ళు తమ అంగాలను
అందంగా ప్రదర్శించాలి..

గంటకి రెండొందల బేరం
కుదిరింది ఓ మనిషీలాంటి
పశువుతో..
మెత్తని పరుపుపై పడుకున్నా
ఆమె శరీరం..
రంపంతో కోసి కారాన్ని అద్దినట్టుగా
నరకాన్ని తనువంతా భరిస్తుంది..

అతడి కోరలు ఆమె మెడపై
రక్తాన్ని జుర్రుతున్నాయి..
కూలీ డబ్బుల కోసం
ఆమె ఒంటిపై నిప్పుని సైతం
నిశ్చలంగా ఓర్చుకుంటుంది..
అతడు ఆమె చెంపపై
తన చేతుని సుత్తిలా మలిచి
బలంగా వేటు వేశాడు..
ఆమె శక్తిహీనురాలు అయ్యి
మూలుగుతుంది..

చచ్చి బ్రతికినట్టుగా ఆమె
స్పృహ లోకి వచ్చింది..
దేహంపై అక్కడక్కడా
రక్తపు మరకలు ఆమె శరీరాన్ని
కప్పుతున్నాయి...
నిస్సత్తువుగా లేచి శరీరాన్ని
సర్దుకుంది...

నీళ్లతో అలసటని కడిగి,
అద్దం ముందు కూలీ కి
సిద్ధం అయింది ...
నిండని కడుపు  నడుచుకుంటూ వెళ్లి
గుమ్మం ముందు కూర్చుంది
గుడ్డి వాళ్ళకోసం
ఆమె కనులు వెతుకుతున్నాయ్..

ఆమె కాలం కనికరించని కూలీ
అని అనుకునేవారు లేరు..
ఎత్తుగా ఉండే ఆమె కూలి పనిముట్లు
లోతుగా ఉండే కష్టాన్ని చెప్పలేవు
ఆమె శరీరం నిరంతర శ్రమతో
నిండినదై నడుస్తుంది
ఆమె వేశ్య కాదు కూలీ.....
(ఆర్ కె విద్యార్థి)